న్యూఢిల్లీ, వెలుగు: కేంద్ర బొగ్గు, గనుల శాఖ సంప్రదింపుల కమిటీలో బీఆర్ఎస్ ఎంపీ వద్ది రాజు రవిచంద్రకు చోటు దక్కింది. శుక్రవారం బొగ్గు, గనుల శాఖ ఒక ప్రకటన రిలీజ్ చేసింది. సంప్రదింపుల కమిటీకి చైర్మన్ గా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యవహరించనున్నారు. ఇందులో పలు పార్టీలకు చెందిన లోక్ సభ, రాజ్య సభ సభ్యులతో పాటు ఎక్స్ ఆఫిషియో మెంబర్లు సభ్యులుగా ఉండనున్నారు. కాగా, వద్దిరాజు రవిచంద్ర ఇప్పటికే పెట్రోలియం, సహజ వాయువు శాఖ పార్లమెంటరీ స్థాయి సంఘం సభ్యులుగా కొనసాగుతున్నారు.