కాంగ్రెస్​లో చేరిన బీఆర్​ఎస్​ ఎంపీ వెంకటేశ్

కాంగ్రెస్​లో చేరిన బీఆర్​ఎస్​ ఎంపీ వెంకటేశ్

న్యూఢిల్లీ, వెలుగు: బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్​ తగిలింది. ఆ పార్టీ పెద్దపల్లి ఎంపీ వెంక‌‌టేశ్​ నేత కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంగళవారం ఢిల్లీలో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ (సంస్థాగ‌‌త‌‌) కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్ రెడ్డి స‌‌మ‌‌క్షంలో ఆయన కాంగ్రెస్​ కండువా కప్పుకున్నారు. కొంత‌‌కాలంగా బీఆర్‌‌ఎస్ చీఫ్​ కేసీఆర్‌‌, వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ అనుస‌‌రిస్తున్న వైఖ‌‌రితో తీవ్ర అసంతృప్తిగా ఉన్న వెంక‌‌టేశ్​ నేత గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పారు. 

ఆయనతోపాటు ఉమ్మడి మహబూబ్​నగర్​ ఎంపీ మన్నె శ్రీనివాస్​రెడ్డి అన్నకుమారుడు, టీటీడీ మాజీ స‌‌భ్యుడు మ‌‌న్నె జీవ‌‌న్ రెడ్డి కూడా కాంగ్రెస్‌‌లో జాయిన్ అయ్యారు. వెంక‌‌టేశ్​ నేత‌‌, జీవన్ రెడ్డికి కేసీ వేణుగోపాల్ కండువా క‌‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేత ర‌‌హ్మాన్‌‌, ప‌‌లువురు నేతలు కూడా కాంగ్రెస్​లో చేరారు.

చేరికల అనంత‌‌రం కేసీ వేణుగోపాల్‌‌, సీఎం రేవంత్ రెడ్డితో క‌‌లిసి ఎంపీ వెంక‌‌టేశ్​ నేత‌‌, మ‌‌న్నె జీవ‌‌న్ రెడ్డి తదితరులు ఏఐసీసీ చీఫ్ మ‌‌ల్లికార్జున ఖర్గేను ఆయ‌‌న నివాసంలో మ‌‌ర్యాద‌‌పూర్వకంగా క‌‌లిశారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భ‌‌ట్టి విక్రమార్క, ఉమ్మడి మ‌‌హ‌‌బూబ్‌‌న‌‌గ‌‌ర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు యెన్నం  శ్రీ‌‌నివాస్ రెడ్డి, జ‌‌నంప‌‌ల్లి అనిరుధ్ రెడ్డి, గ‌‌వినోళ్ల మ‌‌ధుసూద‌‌న్ రెడ్డి, వీర్లప‌‌ల్లి శంక‌‌ర్, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి డాక్టర్ మ‌‌ల్లు ర‌‌వి, రాష్ట్ర మాజీ మంత్రి డాక్టర్ జి.చిన్నారెడ్డి, ఏఐసీసీ ప్రత్యేక ఆహ్వానితుడు చ‌‌ల్లా వంశీచంద్‌‌రెడ్డి త‌‌దిత‌‌రులు పాల్గొన్నారు. అనంతరం హైద‌‌రాబాద్‌‌కు తిరిగి వెళ్లిపోయారు. 

బాబాయితో చర్చించే నిర్ణయం తీసుకున్న: మన్నె జీవన్ రెడ్డి 

రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్​లో చేరడం సంతోషంగా ఉందని మన్నె జీవన్ రెడ్డి అన్నారు. పార్టీ తనపై విశ్వాసంతో ఏ బాధ్యత ఇచ్చినా శక్తి వంచన లేకుండా పనిచేస్తానని చెప్పారు. లోక్ సభ ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన రెండు ఎంపీ సీట్లు కాంగ్రెస్ గెలిచేలా కృషి చేస్తానని అన్నారు. తన బాబాయి అయిన బీఆర్ఎస్ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డితో చర్చించాకే కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. కాంగ్రెస్ లో చేరిన ఎంపీ వెంకటేశ్ నేత బీఆర్ఎస్ సభ్యత్వానికి రాజీనామా చేసి లేఖను కేసీఆర్ కు పంపించారు.

ALSO READ: మిషన్ భగీరథపై విజిలెన్స్.. సెకండరీ, ఇంట్రా పైప్​లైన్​నెట్ వర్క్​లో భారీ అక్రమాలు