
న్యూఢిల్లీ, వెలుగు: ఈనెల 31తో ముగియ నున్న ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు గడు వును ఒక నెలపాటు పొడిగించాలని బీఆర్‌ఎస్ ఎంపీలు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం పార్లమెంట్ లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను బీఆర్ఎస్ ఎంపీలు కే.కేశవ రావు, సురేశ్‌రెడ్డి, లింగయ్య యాదవ్ కలిశారు.
ఆదాయ పన్ను రిటర్న్స్ అంశంపై వినతి పత్రం సమర్పించారు. కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో వరదలు, ప్రకృతి విపత్తులు సంభవించాయని, అందువల్ల రిటర్న్స్ దాఖలు గడువు పెంచాలని కోరారు.