కేంద్ర రైల్వే మంత్రికి బీఆర్ఎస్ ఎంపీల వినతి

కేంద్ర రైల్వే మంత్రికి బీఆర్ఎస్ ఎంపీల వినతి

ఖమ్మం, వెలుగు : ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు స్టేషన్లలో ఉన్న రైల్వే సంబంధిత సమస్యలపై ఢిల్లీలో సోమవారం బీఆర్ఎస్ ఎంపీలు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు వినతి పత్రం అందజేశారు. పార్లమెంటరీ పార్టీ నాయకుడు కేఆర్ సురేష్ రెడ్డి, డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర, ఎంపీ దామోదర్ రావు  రైల్వే మంత్రిని కలిసి పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. భద్రాచలం రోడ్ స్టేషన్ (కొత్తగూడెం) నుంచి హైదరాబాద్ కు కోవిడ్ సమయంలో రద్దు చేసిన రైళ్లతో పాటు, అదనంగా మరికొన్ని రైళ్లు నడపాలని కోరారు.

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుపతికి ప్రత్యేక రైలు నడపాలని కోరారు. గాంధీపురం రైల్వే స్టేషన్ ప్లాట్ ఫాం ఎత్తు పెంచి, ఆధునీకరణ పనులు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. కారేపల్లి రైల్వేస్టేషన్ ను అభివృద్ధి చేయడంతో పాటు గతంలో ఉన్న రిజర్వేషన్ కౌంటర్ ను పునరుద్ధరించాలని కోరారు. ఖమ్మం స్టేషన్లో బీహార్, జైపూర్ వెళ్లే రైళ్లను ఆపాలని వినతిపత్రం అందజేశారు.