
ఉప్పునుంతల, వెలుగు: మండలంలోని మామిళ్లపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ ఎంపీటీసీ రామలక్ష్మమ్మ తన కుమారుడు రామస్వామితో కలిసి ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ బీఆర్ఎస్ ఖాళీ కావడం ఖాయమైందన్నారు. అనంతరెడ్డి, నరసింహారావు, ఎంపీపీ అరుణ నర్సింహారెడ్డి, తిరుపతయ్య గౌడ్, ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు.