భద్రాచలంలో బీఆర్ఎస్​కు షాక్

భద్రాద్రికొత్తగూడెం/భద్రాచలం, వెలుగు : భద్రాచలం నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు మరో షాక్​తగిలింది. వెంకటాపురం మండలానికి చెందిన జడ్పీటీసీతోపాటు పలువురు ఎంపీటీసీలు, సర్పంచులు గురువారం కాంగ్రెస్​లో చేరారు. ఇటీవల బీఆర్ఎస్​ను వీడి కాంగ్రెస్​గూటికి చేరిన మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. కాంగ్రెస్​లో చేరిన వారిలో వెంకటాపురం జడ్పీటీసీ పాయం రమణ

మరికాల సర్పంచ్​వాసం సత్యవతి, బెస్తగూడెం సర్పంచ్ చిడెం లాలిబాబు, ఉప సర్పంచ్​మంచర్ల భిక్షపతి, మర్రిగూడెం సర్పంచ్ అట్టం సత్యవతి, ఉప సర్పంచ్​ జి.ఝాన్సీరాణి, నూగురు సర్పంచ్ ఇండ్ల లలిత, మొర్రవానిగూడెం సర్పంచ్​ఎం.సారయ్య, రాసపల్లి సర్పంచ్ స్వరలం సమ్మయ్య, బర్లగూడెం ఎంపీటీసీ సమ్మక్క, బర్లగూడెం సొసైటీ డైరెక్టర్​తో పాటు పలువురు కార్యకర్తలు ఉన్నారు.