పండుగలు బీజేపీ సొంతమా? : తలసాని

ముషీరాబాద్, వెలుగు: దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్​యాదవ్ చెప్పారు. రాష్ట్రంలో ఏ పండుగ జరిగినా తమ వల్లే జరుగుతున్నాయని బీజేపీ లీడర్లు గొప్పలు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఆధ్వర్యంలో మంగళవారం బాగ్ లింగంపల్లి ఆర్టీసీ కళాభవన్‌లో బీఆర్ఎస్ ​ముషీరాబాద్ నియోజకవర్గ ఆత్మీయ సమ్మేళనం జరిగింది.  

మంత్రి తలసాని పాల్గొని మాట్లాడారు. హిందూ పండుగలు అంటే బీజేపీ సొంతం అన్నట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లింల రిజర్వేష్లను రద్దు చేస్తామని ప్రకటించడం దారుణం అన్నారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ వి.శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ కేవీ అధ్యక్షుడు రాంబాబు యాదవ్, బీఆర్‌‌ఎస్‌ యువజన విభాగం నాయకుడు ముఠా జైసింహ పాల్గొన్నారు.