భద్రాచలం, వెలుగు : భద్రాచలం నియోజకవర్గంలో బీఆర్ఎస్ పంచాయితీ హైదరాబాద్‌కు చేరింది. ఐదు మండలాలకు చెందిన లీడర్లు సోమవారం మంత్రి హరీశ్‌రావుతో, మంగళవారం కేటీఆర్‌తో మాట్లాడనున్నారు. దీనితో వాజేడు, వెంకటాపురం, చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం మండల కమిటీలు హైదరాబాదుకు బయలుదేరాయి. భద్రాచలం నియోజకవర్గం అభ్యర్థిగా తెల్లం వెంకట్రావ్ ను ప్రకటించడం, ఎన్నికల ఇన్చార్జిగా గా ఉన్న మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణను పక్కన బెట్టడాన్ని కమిటీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
ఇప్పటికే వాజేడు, వెంకటాపురం, చర్ల, భద్రాచలంలలో కమిటీల అధ్యక్ష,కార్యదర్శులు మీటింగ్ పెట్టుకున్నారు. స్వార్థం కోసం పార్టీని వదిలి కాంగ్రెస్‌కు వెళ్లి, అక్కడ టిక్కెట్ రావట్లేదని తిరిగి పార్టీలోకి వచ్చిన వెంకట్రావ్‌కు టిక్కెట్ ఇవ్వడాన్ని స్థానిక లీడర్లు ఖండిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక లీడర్లకు హైకమాండ్ పిలుపు రావడంతో.. ఏం జరుగుతుందోనన్న ఆసక్తి మొదలైంది.