జూన్ 4 తర్వాత బీఆర్ఎస్ పార్టీ క్లోజ్ అవుతుందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. బీఆర్ఎస్లో కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు తప్పా ఒక్కరూ ఉండరన్నారు. ఎంపీ ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో సీన్ మొత్తం మారుతుందన్నారు. కవిత జైలుకు వెల్లిందని, బీఆర్ఎస్ ప్రభుత్వం పోయిందనే ఫ్రస్టేషన్ లో కేటీఆర్ ఉన్నారని.. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ మాటలు అసహ్యంగా ఉన్నాయన్నారు.
మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించినందుకు,30 వేల మందికి ఉద్యోగ నియామకాలు చేపట్టినందుకా రేవంత్ రెడ్డిని కేటీఆర్ తిడుతున్నాడా అని ప్రశ్నించారు. వైఎస్సార్ తరహాలో రేవంత్ రెడ్డి కూడా ప్రజలకు అందుబాటులో ఉంటుంన్నారని చెప్పారు. బీఆర్ఎస్ హాయాంలో మద్యం అమ్మాకాలు పెరిగాయి తప్ప అభివృద్ధి జరగలేదని విమర్శించారు. వైన్ షాపుల పేరు మీద గత ప్రభుత్వం రూ.2500 కోట్లు రాబట్టిందన్నారు.
ఎమ్మెల్సీ కవిత చేసిన పనికి తెలంగాణ ప్రజలు తలెత్తుకోలేకపోతున్నారని.. తాము ఇతర రాష్ట్రాలకు వెల్లలేకపోతున్నామన్నారు మంత్రి కోమటిరెడ్డి. తీన్మార్ మల్లన్న మీద కేసులు ఉన్నాయని కేటీఆర్ అంటున్నాడని.. కవిత కేసు గురించి ఎందుకు మాట్లాడడం లేదని నిలదీశారు. ఉద్యమకారుడు కేకే మహెందర్ రెడ్డిని బీఆర్ఎస్ నుంచి వెల్లగొట్టిందే కేటీఆర్ అని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డికి భయపడి కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదన్న మంత్రి.. బీఆర్ఎస్ ఎల్బీ బాధ్యత కేటీఆర్ కు ఇస్తే హరీష్ రావు కొత్త దుకాణం పెట్టే ఆలోచనలో ఉన్నారట కీలక వ్యాఖ్యలు చేశారు.
దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వమని ఎక్కడా చెప్పలేదన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. పేదలకు సన్న బియ్యం ఇవ్వాలని సన్నాలకు బోనస్ ఇస్తామని చెప్పామన్నారు. తమ పార్టీ 12 కు తగ్గకుండాఎంపీ స్థానాలను గెలుస్తుందన్న మంత్రి.. బీఆర్ఎస్ కు రెండు, మూడు చోట్ల డిపాజిట్ వస్తే ఎక్కువేనన్నారు. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రాబోతుందని.. జూన్ 5 తర్వాత బీఆర్ఎస్ నేతలు అంతా కేఏ పాల్ లాగా తిరగాల్సిందేనని ఎద్దేవా చేశారు.