మెల్లిమెల్లిగా మహబూబాబాద్ జిల్లాలో కారు పార్టీ ఖాళీ అవుతుంది. బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకల నరేష్ రెడ్డి, మహబూబాబాద్ మున్సిపల్ ఛైర్మన్, డాక్టర్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి, మాజీ సీఎంకేసిఆర్ కు ప్రధాన అనుచరుడిగా పేరున్న మార్నేని వెంకన్నతోపాటు పలువురు కౌన్సిలర్లు, మాజీ సర్పంచులు బీఆర్ఎస్ కు రాజీనామా చేసేందుకు సిద్దమయ్యారు.
మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ప్రధాన అనుచరుడు ఇంట్లో ముఖ్యకార్యకర్తలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ కు రాజీనామా చేయాలని డిసైడ్ అయ్యారు. వీరంతా ఈ నెల 15 తేదీన సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెసులో చేరనున్నారు.
మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్కు ఆ పార్టీ లీడర్లు షాక్ ఇస్తున్నరు. సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరేందుకు రెడీ అవుతున్నరు. తాజాగా మరో బీఆర్ఎస్ సీనియర్ నేత, ఆదిలాబాద్ మాజీ ఎంపీ గొడం నగేశ్ కూడా బీజేపీ కండువా కప్పుకునేందుకు సిద్ధమైనట్టు సమాచారం. గొడం నగేశ్ బోథ్ నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా, ఎంపీగా గెలిచారు.