
దుబ్బాక, వెలుగు : సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలంలోని పలు గ్రామాల మాజీ సర్పంచ్‌లు మూకుమ్మడిగా బీఆర్ఎస్ కురాజీనామా చేశారు. సోమవారం కాంగ్రెస్నియోజకవర్గ ఇన్‌చార్జి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి, సిద్దిపేట ఇన్‌చార్జి పూజల హరికృష్ణ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ప్రభుత్వం చేపడుతున్న ఆరు గ్యారంటీలు, ప్రజారంజక పాలనకు ఆకర్శితులై కాంగ్రెస్‌లో చేరుతున్నారని చెప్పారు.
త్వరలో నియోజకవర్గంలోని ఎంపీటీసీలు అందరూ కాంగ్రెస్‌లో చేరడానికి సిద్ధమవుతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్‌లో చేరిన మాజీ సర్పంచ్‌లలో భారతి భూపతి గౌడ్, చుక్క శంకర్, గుల్ల పుష్ప భాగులు, చంద్రమౌళి, ఎనగంటి కిష్టయ్య, నర్సింహారెడ్డి ఉన్నారు. కార్యక్రమంలో తుక్కాపూర్ సర్పంచ్ విజయ్ రెడ్డి పాల్గొన్నారు.
బీఆర్ఎస్కు పీఏసీఎస్ వైస్ చైర్మన్ గుడ్‌బై
దుబ్బాక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వైస్ చైర్మన్ కాల్వ నరేశ్ బీఆర్ఎస్కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.ఎమ్మెల్యే వైఖరికి విసుగు చెంది ఆత్మాభిమానం చంపుకోలేక బీఆర్ఎస్కు రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.