బీఆర్ఎస్ ఆఫీస్ కాంగ్రెస్​ ఆఫీసైంది!

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లోని బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు ఒక్క రోజులోనే కాంగ్రెస్ ఆఫీసుగా మారిపోయింది. ఇటీవల బీఆర్ఎస్​నుంచి  కాంగ్రెస్‌‌‌‌లో చేరిన వొడితల ప్రణవ్ తన స్థలంలో ఉన్న బీఆర్ఎస్ ఆఫీసును కాంగ్రెస్ ఆఫీసుగా మార్చేశారు.  

కెప్టెన్ లక్ష్మీకాంతారావు కుటుంబం బీఆర్ఎస్‌‌‌‌లో చేరినప్పటి నుంచి మున్సిపల్​ఆఫీసు పక్కన ఉన్న ఈ  స్థలంలోనే బీఆర్ఎస్​ఆఫీసు కొనసాగుతోంది. బై ఎలక్షన్ టైంలో కూడా ఇక్కడి నుంచే  కార్యకలాపాలు నిర్వహించారు. ఎన్నికల ముందు సొంత ఆఫీసు లేకపోవడంతో బీఆర్ఎస్ లీడర్లు పరేషాన్​లో పడిపోయారు. వెంటనే పార్టీ ఆఫీసు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి పార్టీ నేతలకు సూచించారు.