- కాంగ్రెస్ అభ్యర్థి మన్నె జీవన్ రెడ్డిపై 109 ఓట్లతో నవీన్ కుమార్‌రెడ్డి విజయం
మహబూబ్‌నగర్/షాద్ నగర్, వెలుగు: మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాన్ని బీఆర్ఎస్ పార్టీ తిరిగి దక్కించుకుంది. ఈ స్థానంలో ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. అనంతరం ఆయన ఎమ్మెల్సీ పోస్టుకు రాజీనామా చేయగా.. గత మార్చి 28న ఈ స్థానానికి బైపోల్ నిర్వహించారు.
అనంతరం ఆయన ఎమ్మెల్సీ పోస్టుకు రాజీనామా చేయగా.. గత మార్చి 28న ఈ స్థానానికి బైపోల్ నిర్వహించారు. కాంగ్రెస్ నుంచి మన్నె జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి ఉమ్మడి మహబూబ్‌నగర్‌జిల్లా మాజీ జడ్పీ చైర్మన్నవీన్ కుమార్ రెడ్డి, ఇండిపెండెంట్‌గా సుదర్శన్ గౌడ్ పోటీ చేశారు. 1,439 మంది ఓటర్లకు గాను.. 1,437 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని గవర్నమెంట్బాయ్స్జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రంలో ఆదివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపును ప్రారంభించారు.
మొత్తం 1,437 ఓట్లలో 1,416 వ్యాలిడ్, 21 ఇన్ వ్యాలిడ్ ఓట్లు ఉన్నాయి. 709 ఓట్లు కోటాగా నిర్ణయించి వ్యాలిడ్ ఓట్లు అభ్యర్థుల వారీగా మొదటి ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. అందులో బీఆర్ఎస్ క్యాండిడేట్నవీన్ రెడ్డికి 762 ఓట్లు, కాంగ్రెస్ క్యాండిడేట్ మన్నె జీవన్ రెడ్డికి 653 ఓట్లు, ఇండిపెండెంట్ క్యాండిడేట్ సుదర్శన్ గౌడ్ కు ఒక ఓటు పోల్ అయ్యాయి. కోటా పక్రారం మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో బీఆర్ఎస్ క్యాండిడేట్, కాంగ్రెస్ క్యాండిడేట్పై 109 ఓట్ల ఆధిక్యం సాధించడంతో విన్నర్‌గా ప్రకటించారు. అనంతరం నవీన్ రెడ్డికి ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రవి నాయక్ ధ్రువీకరణ పత్రం అందించారు.
సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకున్న బీఆర్ఎస్
బీఆర్ఎస్ అధికారంలో ఉన్న టైంలో 2022లో మహబూబ్‌నగర్ జిల్లాలోని రెండు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అప్పట్లో లోకల్‌బాడీ ఓటర్లంతా బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే కావడంతో, అప్పుడు ఇదే పార్టీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీలుగా పోటీ చేసిన కసిరెడ్డి నారాయణ రెడ్డి, కూచకుళ్ల దామోదర్ రెడ్డిని యునానిమస్‌గా ఎన్నుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కసిరెడ్డి నారాయణ రెడ్డి కల్వకుర్తి అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసేందుకు ప్రయత్నించారు.
కానీ, టికెట్‌నిరాకరించడంతో బీఆర్ఎస్కు రాజీనామా చేసి, కాంగ్రెస్‌లో చేరి టికెట్ తెచ్చుకొని ఎమ్మెల్యేగా పోటీ చేశారు. కల్వకుర్తి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో, డిసెంబరులో ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఈ స్థానానికి బై ఎలక్షన్ నిర్వహించారు. బై పోల్‌లో కూడా బీఆర్ఎస్ పార్టీకే చెందిన క్యాండిడేట్ విజయం సాధించడంతో, స్థానిక సంస్థల్లో ఆ పార్టీ తన పట్టును నిలుపుకున్నట్టయింది. గత ఏప్రిల్ 2వ తేదీనే ఓట్లను లెక్కించాల్సి ఉండగా, పార్లమెంట్ఎలక్షన్ కోడ్ రావడంతో కౌటింగ్‌ను వాయిదా వేయాలని ఈసీ ఆదేశాలివ్వడంతో ఆదివారం ఓట్లను లెక్కించారు.
మాజీ సీఎం కేసీఆర్‌ను కలిసిన నవీన్ కుమార్ రెడ్డి
మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికైన నాగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ప్రెసిడెంట్, మాజీ సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఆదివారం ఓట్ల లెక్కింపు అనంతరం తన భార్యతో కలిసి నందినగర్ లో కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డిని కేసీఆర్ సన్మానించి అభినం దనలు తెలిపారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం నవీన్ రెడ్డిని అభినందించారు. ఈ సందర్భంగా నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు.