వరంగల్​ బీఆర్ఎస్​ ఎంపీ అభ్యర్థిగా సుధీర్​కుమార్

  • హనుమకొండ జడ్పీ చైర్మన్​కు టికెట్
  • ప్రకటించిన బీఆర్‌‌‌‌ఎస్ చీఫ్​ కేసీఆర్‌‌‌‌

హైదరాబాద్, వెలుగు : వరంగల్ నియోజకవర్గ ఎంపీ అభ్యర్థిని బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ ప్రెసిడెంట్ కేసీఆర్ ఖరారు చేశారు. హనుమకొండ జడ్పీ చైర్మన్, మారేపల్లి సుధీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుమార్​కు టికెట్​ కేటాయిస్తున్నట్టు శుక్రవారం ప్రకటించారు. ఎర్రవల్లిలోని ఫామ్‌‌‌‌‌‌‌‌హౌస్​లో వరంగల్ పార్లమెంట్ పరిధిలోని లీడర్లతో శుక్రవారం కేసీఆర్ సమావేశమయ్యారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి, మాజీ స్పీకర్ మధుసూధనాచారి తదితరులు పాల్గొన్నారు. మాజీ బఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌‌‌‌‌‌‌‌రెడ్డి భార్య పెద్ది స్వప్న (ఎస్సీ, మాల), సుధీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుమార్ అభ్యర్థిత్వంపై ఈ మీటింగ్‌‌‌‌‌‌‌‌లో చర్చించారు.

ప్రస్తుతం మాల, మాదిగ పంచాయితీ నడుస్తున్న నేపథ్యంలో, మాదిగ సామాజిక వర్గానికి చెందిన సుధీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుమార్ వైపే కేసీఆర్ మొగ్గు చూపారు. వరంగల్‌‌‌‌‌‌‌‌లో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌, బీజేపీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులు కూడా మాదిగ సామాజిక వర్గానికి చెందిన నేతలే కావడం కూడా ఇందుకు కారణంగా తెలుస్తోంది. సుధీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్ 2001 నుంచి బీఆర్ఎస్​ పార్టీలో ఉన్నారు. సుధీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు టికెట్ ఇవ్వడాన్ని ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీ ముఖ్య నేతలంతా ఏకగ్రీవంగా ఆమోదించారని కేసీఆర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.