
హైదరాబాద్, వెలుగు: ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారానికి బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేసీఆర్కు ఆహ్వానం అందిందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. బీజేపీ నేత, కేంద్ర బొగ్గు గనులు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేసిన ప్రహ్లాద్ జోషి కేసీఆర్కు ఫోన్ చేసి, ఆహ్వానించారని శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. అయితే, కేసీఆర్ ఈ కార్యక్రమానికి హాజరవుతారా.. లేదా.. అన్న విషయంలో స్పష్టత లేదని వారు తెలిపారు.