ఈహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అమలును సర్కార్ నిర్లక్ష్యం చేస్తోంది: కేటీఆర్

ఈహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అమలును సర్కార్ నిర్లక్ష్యం చేస్తోంది: కేటీఆర్

హైదరాబాద్, వెలుగు : ప్రజా పాలనలో ప్రభుత్వ ఉద్యోగులకు తిప్పలు తప్పడం లేదని, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (ఈహెచ్ఎస్) అమలులో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. తాము ఎన్నికలకు ముందు ఇచ్చిన హెల్త్ కేర్ ట్రస్ట్ జీవోను అమలు చేయకుండా, ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ మేరకు శుక్రవారం కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘‘కాంగ్రెస్ మొండి వైఖరితో సుమారు 20 లక్షల కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి.

నాడు మా ప్రభుత్వం ఇచ్చిన జీవోను తక్షణమే అమలు చేసి, ఉద్యోగులు, పెన్షనర్లకు ఉపశమనం కలిగించాలి. గాంధీ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మాతా, శిశు మరణాలపై మాజీ ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, మెతుకు ఆనంద్,  ఎమ్మెల్యే సంజయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో నిజ నిర్ధారణ కమిటీ వేస్తున్నాం. ఈ కమిటీ గాంధీ దవాఖానతో పాటు రాష్ట్రంలోని ఇతర ఆసుపత్రులను సందర్శించి అక్కడి పరిస్థితులను అధ్యయనం చేస్తుంది. నిర్మాణాత్మకమైన సూచనలతో కూడిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తుంది” అని కేటీఆర్ తెలిపారు. 

కడియంపై వేటు తప్పదు..

ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై అనర్హత వేటు తప్పదని బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. ఆయనపై వేటు పడ్డాక వచ్చే ఉప ఎన్నికల్లో స్టేషన్ ఘన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ జెండా ఎగురవేస్తామన్నారు.