ఏప్రిల్‌ 13న చేవెళ్లలో బీఆర్ఎస్ బహిరంగ సభ

ఏప్రిల్‌ 13న చేవెళ్లలో బీఆర్ఎస్ బహిరంగ సభ

లోక్ సభ ఎన్నికలకు బీఆర్ఎస్ రెడీ అయింది. అన్ని స్థానాల్లో ఇప్పటికే  అభ్యర్థులను ప్రకటించిన గూలాబీ బాస్ కేసీఆర్ ఎన్నికల ప్రచారాన్ని మరింత స్పీడ్ పెంచనున్నారు. ఇప్పటికే కరీంనగర్ వేదికగా భారీ బహిరంగ సభ నిర్వహించి  ఎన్నికల శంకరావాన్ని పూరించిన బీఆర్ఎస్ .. ఏప్రిల్‌ 13న చేవెళ్లలో బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ విషయాన్ని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ తెలిపారు.  

మార్చి 27వ తేదీన  తెలంగాణ భవన్ లో చేవెళ్ల పార్లమెంట్ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేల‌తో కేటీఆర్ స‌మావేశ‌మై, లోక్‌స‌భ ఎన్నిక‌ల‌పై చ‌ర్చించారు. చెవేళ్లలో తలపెట్టిన సభకు కేసీఆర్ హాజరుకానున్నట్లుగా కేటీఆర్ తెలిపారు. ఈ బ‌హిరంగ స‌భ‌కు భారీ సంఖ్యలో వచ్చి విజ‌యంతం చేయాల‌ని కేటీఆర్ కోరారు.  

Also Read:బిల్డింగ్‌‌లకు ఎందుకు పర్మిషన్లు... ఇవ్వడం లేదు

ఎంపీ  రంజిత్ రెడ్డిపై కేటీఆర్ ఫైరయ్యారు. రంజిత్‌ రెడ్డి పార్టీకి ద్రోహం చేసి కాంగ్రెస్‌కు వెళ్లారని మండిపడ్డారు.  చేవెళ్లలో కాంగ్రెస్‌ పార్టీకి కనీసం అభ్యర్థి కూడా దొరకలేదని..  లోక్‌సభ ఎన్నికల్లో హస్తం పార్టీ తీవ్రమైన అయోమయంలో ఉందని విమర్శించారు.  చేవెళ్ల, మల్కాజిగిరి, సికింద్రాబాద్‌లో కాంగ్రెస్‌ గెలవడం అసాధ్యమని కేటీఆర్ జోస్యం చెప్పారు. కాగా చేవెళ్ల నుంచి బీఆర్ఎస్ తరుపున కాసాని జ్ఞానేశ్వర్, కాంగ్రెస్ నుంచి రంజిత్ రెడ్డి,  బీజేపీ నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి బరిలో ఉన్నారు.