తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు రాజకీయాలు సర్వత్రా ఆసక్తికరంగా మారాయి. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా పాలిటిక్స్ మరింత హాట్ టాపిక్ గా మారాయి. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి, కాంగ్రెస్ పార్టీలో చేరడంతో అధికార పార్టీ అలర్ట్ అయ్యింది. కాంగ్రెస్ లో తుమ్మల చేరికతో బీఆర్ఎస్ లో ఆందోళన మొదలైంది.
Also Read : ఖైరతాబాద్ గణేష్ దర్శనానికి పోటెత్తిన భక్తులు
తాజాగా ఎంపీ నామా నాగేశ్వరరావు నివాసంలో ఖమ్మం జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, వైరా ఎమ్మెల్యే రాములు నాయక్, అభ్యర్థి మదన్ లాల్, ఎమ్మెల్సీ తాత మధుతో పాటు ఇతర ముఖ్య నాయకులు హాజరయ్యారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపుపై వీరంతా చర్చించినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపైనా చర్చించారని చెబుతున్నారు. తుమ్మల పార్టీని వీడిన తరువాత తాజా రాజకీయ పరిస్థితులు చర్చకు వచ్చినట్లు సమాచారం. బీఆర్ఎస్ నేతలందరూ కలిసికట్టుగా ఉండి ఎన్నికల బరిలో ఉండాలని నేతలకు ఎంపీ నామా నాగేశ్వరరావు సూచించారు.