రేవంత్ పదేండ్లు అధికారంలో ఉంటడు:ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్

  • మేమేం చిన్నపిల్లలం కాదు
  • కాంగ్రెస్ పార్టీలో  స్వేచ్చ ఉంటది
  • చంద్రబాబు నా రాజకీయ గురువు 
  • రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్

తిరుమల: సీఎం రేవంత్ రెడ్డి మరో పదేండ్లు అధికారంలో ఉంటారని బీఆర్ ఎస్​రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ అన్నారు. ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించు కున్న ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి యువకుడు, తెలివైన వారని ప్రశంసలు కురిపించారు.  ఇవ్వాళ సాయంత్రం ఏడు గంటలకు  రేవంత్​రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నానని  ఆయన తెలిపారు. 

నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్​లో జాయిన్ అవుతున్నానని ఆయన చెప్పారు. ఎవరెవరు పార్టీ మారుతారనే దానిపై స్పష్టత లేదని, తాను మాత్రం ఒంటరిగానే చేరుతున్నానని పేర్కొనారు. రూలింగ్ పార్టీలో ఉంటే సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ నాయకత్వంలో కొంత అభివృద్ధి చేసుకున్నామన్నారు. ఎవరిపై బురద జల్లేది లేదన్నారు.

ALSO READ | జూలై 16న సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం.. 9 పాయింట్స్!

 భయభ్రాంతులకు గురి చేసి పార్టీలో జాయిన్ చేసుకుంటున్నారన్న కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. బెదిరించడానికి తామేమి చిన్నపిల్లలం కాదన్నారు. మాపై ఎవరి ఒత్తిడి లేదని,  ఇష్ట ప్రకారమే కాంగ్రెస్​లోకి   వెళుతున్నామని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి  స్పష్టమైన మెజారిటీ ఉందన్నారు. చంద్రబాబు తన రాజకీయ గురువు అని ఆయన అన్నారు.