- దావోస్‌లో సమావేశమైన ఫొటో నేనే ట్విట్టర్ లో పెట్టిన: కేటీఆర్
హైదరాబాద్, వెలుగు: అదానీని బరాబర్ కలిశానని, దావోస్‌లో ఆయనతో సమావేశమయ్యానని బీఆర్ఎస్వర్కింగ్ప్రెసిడెంట్కేటీఆర్ తెలిపారు. ‘‘నేను అదానీని కలిసినట్టు సీఎం రేవంత్‌రెడ్డి ఫొటో చూపిస్తున్నారు. ఆ ఫొటోను నేనే ట్విట్టర్లో పెట్టాను. కానీ రేవంత్‌లాగా నేనేమీ ఇంటికి పిలిపించుకుని నాలుగు గంటలు రహస్యంగా చర్చలు జరపలేదు. కోహినూర్హోటల్లో సీక్రెట్‌గా కాళ్లు పట్టుకోలేదు.
రేవంత్‌లాగా లుచ్చా పనులు చేసే అలవాటు నాకు లేదు. ఏది చేసినా బాజాప్తా చేస్తాను” అని అన్నారు. రాహుల్‌గాంధీతో తిట్లు పడిన తర్వాతే అదానీ నుంచి తీసుకున్న రూ.వంద కోట్లను సీఎం రేవంత్‌రెడ్డి తిరిగిచ్చేశారని చెప్పారు. మంగళవారం తెలంగాణ భవన్లో మీడియాతో కేటీఆర్ మాట్లాడారు. అదానీని తాము ఎంకరేజ్చేయలేదన్నారు.
అదానీకి మేం ఇవ్వని ప్రాజెక్టులను కూడా ఇచ్చామంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. హైవే ప్రాజెక్టులు, విద్యుత్ ప్రాజెక్టు కేంద్రం ఇచ్చింది. డ్రైపోర్టు కేంద్ర, రాష్ట్రాల పరిధిలోని అంశం. దానికి కూడా కేంద్రం పర్మిషన్ఉండాలి” అని మండిపడ్డారు.
ఏడాది పాలనలో ఏం చేసినవ్?
ఏడాది పాలనలో సీఎం రేవంత్ రెడ్డి ఏం చేశారని కేటీఆర్ ప్రశ్నించారు. ‘‘అదానీ చెక్ఇచ్చి 38 రోజులవుతున్నా, దాన్ని ఇప్పటిదాకా ఎందుకు క్యాష్ చేసుకోలేదు. చెక్చూపించి వెనుక నుంచి ఆ డబ్బులు దోచేసే కుట్ర చేశారు. పంప్డ్స్టోరేజ్పాలసీ అంటూ అదానీతో రూ.12,440 కోట్ల పెట్టుబడులు తెచ్చామని సీఎం అంటున్నారు. అసలు రాష్ట్రంలో పంప్డ్స్టోరేజ్పాలసీ ఉందా? కొడంగల్‌లో అల్లుడి కోసం భూములు సేకరిస్తున్నారని అనుకున్నాం. కానీ, సీఎం మాటలతో అది అదానీ కోసం చేస్తున్నట్టుగా తేలింది. రామన్నపేటలోనే అదానీ సిమెంట్‌ఫ్యాక్టరీ వద్దని అక్కడి ప్రజలు అంటుంటే.. కొడంగల్‌లోనూ అదానీ సిమెంట్‌ఫ్యాక్టరీ పెడతామని అంటున్నారు” అని ఫైర్ అయ్యారు.
ఇదేనా ప్రజాపాలన?
గురుకుల విద్యార్థుల మరణాలపై సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటివరకు కనీసం ఒక్క సమీక్ష కూడా చేయలేదని కేటీఆర్ మండిపడ్డారు. 48 మంది విద్యార్థులను ప్రభుత్వం పొట్టనపెట్టుకున్నదని ఫైర్ అయ్యారు. దీనిపై అసెంబ్లీలో పోరాడతామని చెప్పారు.