
యాదాద్రి భువనగిరి జిల్లా : సోమవారం (అక్టోబర్ 16వ తేదీన) భువనగిరి పట్టణంలో బీఆర్ఎస్ సభ నిర్వహిస్తున్నారు. ఈ సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకానున్నారు. భువనగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో సభా స్థలిని ఏర్పాటు చేశారు. దగ్గరుండి ఏర్పాట్లను స్థానిక ఎమ్మేల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. సభా స్థలిలో తొలుత టెంట్ కోసం ఇనుప స్తంభాలను వేసినా సాయంత్రం మీటింగ్ కావటంతో వ్యూ సరిగా కనిపించదని మళ్లీ వాటిని తీసివేశారు. ప్రస్తుతం పనులు మాత్రం వేగంగా జరుగుతున్నాయి.
Also Read :- బీఆర్ఎస్ vs కాంగ్రెస్
16వ తేదీన సీఎం కేసీఆర్ భువనగిరికి రానున్నారు. మొదటగా జనగాం జిల్లాకు వెళ్లి అకడి నుంచి భువనగిరి పట్టణానికి చేరుకుంటారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగే ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగిస్తారు. సభ కోసం బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. బోనాలు, బతుకమ్మలు, బైక్ ర్యాలీలతో ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికేందుకు బీఆర్‌ఎస్ నాయకులు, అభిమానులు సమాయత్తమవుతున్నారు.