సర్కార్‌‌కు సాగునీటి దినోత్సవం జరిపే అర్హత లేదు..డీసీసీ అధ్యక్షుడు ఆది శ్రీనివాస్​

వేములవాడ రూరల్, వెలుగు: బీఆర్ఎస్​ సర్కార్‌‌కు సాగునీటి దినోత్సవం నిర్వహించే అర్హత లేదని డీసీసీ అధ్యక్షుడు ఆది శ్రీనివాస్​ ఆరోపించారు. బుధవారం కాంగ్రెస్​ ఆధ్వర్యంలో వేములవాడ రూరల్​ మండలం చెక్కపల్లి నుంచి మర్రిపల్లి గ్రామం వరకు బైక్​ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు, చెరువులను పట్టించుకోని ప్రభుత్వం సాగునీటి  దినోత్సవాల పేరిట సంబురాలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. నియోజకవర్గంలోని ఫాజుల్​నగర్‌‌ ప్రాజెక్ట్, సూరమ్మ ప్రాజెక్ట్​లను పూర్తి చేయకుండానే ఈ సంబురాలు ఏంటని ప్రశ్నించారు. నియోజకవర్గంలో పెండింగ్​లో ఉన్న  ప్రాజెక్టులను  వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.

లీడర్లు శ్రీనివాస్, స్వామి, కరుణాకర్, రాములు, రాజు, వేణు, ఎల్లయ్య పాల్గొన్నారు. రైతులు ఇబ్బందులు పడుతుంటే ఉత్సవాలా.. కథలాపూర్, వెలుగు: రైతులు ఇబ్బందులు పడుతుంటే సర్కార్​దశాబ్ది ఉత్సవాలు జరుపుకోవడం సిగ్గుచేటని కాంగ్రెస్​ మండల, బ్లాక్​ అధ్యక్షులు కాయితి నాగరాజు, ఎండీ అజీమ్, పీసీసీ కార్యవర్గ సభ్యుడు తొట్ల అంజయ్య ఆరోపించారు. బుధవారం కథలాపూర్ మండలం కలికోట గ్రామంలో సూరమ్మ ప్రాజెక్ట్ వద్ద సర్కార్​ తలపెట్టిన సాగునీటి దినోత్సవాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్​ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. కార్యక్రమంలో లీడర్లు కల్లెడ గంగాధర్ , మార్కం రాజేశం, రాజేశ్ , శిరీష, అనిల్ ,రవి , దేవన్న పాల్గొన్నారు.