నిజామాబాద్ లో జిల్లాలో ఎస్సైపై అధికార పార్టీ సర్పంచ్ దౌర్జన్యానికి పాల్పడ్డారు. తాను సర్పంచ్ నంటూ ఎస్సైతో వాగ్వాదానికి దిగాడు. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రుద్రుర్ మండల కేంద్రంలో ఆదివారం రాత్రి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. కోడి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఫుల్లుగా తాగి అతని భార్యతో కోటగిరి వైపు వెళ్తున్నాడు. అతడిని టెస్ట్ చేయగా 360 వచ్చింది. అప్పుడే కోటగిరి మండలం సుద్దలం గ్రామానికి చెందిన సర్పంచ్ అటువైపు వెళుతుండగా అతన్ని విడిచిపెట్టాలని పోలీసులకు చెప్పాడు. తాను సర్పంచ్ ని అంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. అక్కడున్న ఇద్దరు పోలీసులను చెయ్యితో నెట్టేశాడు. ఎస్సైపై సర్పంచ్ చేయిచేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే నియోజక వర్గ కీలక నేత మధ్యవర్తిత్వంతో ఈ విషయం బయటకు రాలేదని తెలుస్తోంది.