
తెలంగాణ జిల్లాల్లో పలువురు అధికార పార్టీ సర్పంచ్‌లు, నేతల దౌర్జన్యాలు ఎక్కువవుతున్నాయి. తాజాగా వరంగల్ జిల్లాలో ఓ సర్పంచి నిరుపేదలపై దాడికి పాల్పడ్డారు.
బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. గీసుగొండ మండలం ఎల్కుర్తి గ్రామానికి చెందిన సురేష్ ఓ వివాదం పరిష్కరించాలని బీఆర్ఎస్ సర్పంచ్ జైపాల్‌రెడ్డిని ఆశ్రయించారు. ఈ క్రమంలో సర్పంచ్సురేష్పై దాడికి పాల్పడ్డాడు.
గ్రామస్థుల ముందు సర్పంచ్ దాడి చేయడంతో మనస్తాపానికి గురైన సురేష్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారని కుటుంబసభ్యులు వాపోయారు. అతని పరిస్థితి విషమించడంతో వరంగల్ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతున్నాడు.
సర్పంచ్‌పై చర్యలు తీసుకోవాలని సురేష్ కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు.