పంచాయతీ కార్యదర్శిపై సర్పంచ్ భర్త దాడి చేసిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లికదురు మండలం బంజర గ్రామ పంచాయతీ కార్యదర్శి దర్గయ్యపై జూన్ 22న బీఆర్ఎస్ సర్పంచ్ చిర్ర లక్ష్మీ భర్త చిర్ర జనార్దన్‌రెడ్డి దాడికి దిగాడు. ఈ దాడిలో దర్గయ్యకు గాయాలయ్యాయి. దీంతో ఆయనను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం బాధితుడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
సర్పంచ్ భర్త పై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశాడు. విషయం తెలుసుకున్న తోటి సిబ్బంది పంచాయతీ కార్యదర్శులకు రక్షణ కల్పించాలంటూ ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. బాధితుడికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కాగా జిల్లాల్లో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల ఆగడాలు రోజురోజుకీ ఎక్కువవుతున్నాయి. పలు చోట్ల పోలీస్ సిబ్బంది వీటిని చూసి చూడనట్లు వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది.