కేసీఆర్పై సర్పంచుల పోరాటం

రాష్ట్ర సర్కార్పై సర్పంచులు తిరుగుబాటు చేస్తున్నారు. అప్పులు చేసి పనులు చేయించినా.. బిల్లులు రావడం లేదంటూ రాజీనామాలు, డీపీవో ఆఫీసుల ఎదుట నిరసనలు చేపడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ ఎంపీడీవో ఆఫీసులో బీఆర్ఎస్ సర్పంచులు సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. 

ప్రభుత్వం వెంటనే పెండింగ్ నిధులను రిలీజ్ చేయాలని సర్పంచులు డిమాండ్ చేశారు. అప్పులు చేసి పనులు చేయించినా బిల్లులు రావడం లేదని వాపోయారు. ఇప్పటికైనా నిధులు విడుదల చేయకపోతే బీఆర్ఎస్ పార్టీకి, పదవులకు రాజీనామా చేస్తామని స్పష్టం చేశారు.