బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేశారు మంత్రి జూపల్లి కృష్ణా రావు. బీఆర్ఎస్ శవరాజకీయాలు చేస్తోందని ఫైర్ అయ్యారు. శ్రీధర్ రెడ్డి హత్యకు భూతగాదాలు, ఆర్థిక లావాదేవీలే కారణమన్నారు. వ్యక్తిగత కారణాలతో జరిగిన హత్యను తనకు పూయాలని చూస్తున్నారని విమర్శించారు. తన ప్రతిష్టను దెబ్బతీసి తద్వారా బీఆర్ఎస్ మైలేజ్ పెంచుకోవాలని చూస్తుందన్నారు.
వాస్తవాలు తెలుసుకోకుండా చాన్స్ దొరికిందని బురదజల్లే ప్రయత్నం చేయడం సరికాదన్నారు. ఎన్నికల ఎఫెక్ట్ నుంచి బీఆర్ఎస్ ఇంకా కోలుకోలేదని విమర్శించారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, కేటీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తప్పుడు ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని వెల్లడించారు. కేటీఆర్ అడ్డగోలుగా ఆరోపణలు చేయడం మానుకోవాలని సూచించారు.
గతంలో పెద్దకొత్తపల్లి మండలం గంట్రావుపల్లిలో మల్లేశ్ హత్యకు కూడా రాజకీయ రంగు పులిమారని, ఇప్పుడు శ్రీధర్‌రెడ్డి హత్యనూ రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. ఈ ఘటనపై పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తున్నారన్నారు. ఇకనైనా కేటీఆర్ శవ రాజకీయాలు చేయడం మానుకోవాలని సూచించారు.