పెద్దపల్లి జెడ్పీ చైర్మన్పై బీఆర్ఎస్ సీనియర్ నాయకుల తిరుగుబాటు

పెద్దపల్లి జిల్లా : పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పై బీఆర్ఎస్ సీనియర్ నాయకులు తిరుగుబాటు ఎగురవేశారు. మంథని నియోజకవర్గంలోని అసంతృప్తి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, తెలంగాణ ఉద్యమకారులు ముత్తారం మండల కేంద్రంలో సమావేశమయ్యారు. బీఆర్ఎస్ పార్టీ సమావేశాలకు జెడ్పీ చైర్మన్ పుట్ట మధు పిలవడం లేదని, ఒంటెద్దు పోకడలకు పోతున్నాడని ఆరోపించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇస్తే సహకరించమని బీఆర్ఎస్ అధిష్టానాన్ని హెచ్చరించారు.