తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్​ను ప్రజలే అధికారంలోకి తెస్తారు: కాంగ్రెస్​ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి

కారేపల్లి,వెలుగు: వచ్చే ఎన్నికల్లో  కాంగ్రెస్​ ప్రభంజనాన్ని చూసి బీఆర్​ఎస్​ నాయకులు పారిపోవాల్సిందేనని కాంగ్రెస్​ నేత  పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మండలంలోని భాగ్యనగర్​తండాలో  పలువురు  కాంగ్రెస్​లోకి చేరారు. ఈ  సందర్భంగా నిర్వహించిన సమావేశంలో పొంగులేటి మాట్లాడారు.  తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్​ పార్టీని తెలంగాణలో అధికారంలోకి తెచ్చి సోనియా గాంధీకి గిఫ్ట్​గా ఇచ్చేందుకు ప్రజలంతా సిద్దమయ్యారని,  దీన్ని ఎవరూ ఆపలేరని అన్నారు.  

బీఆర్​ఎస్​ ప్రభుత్వ హయాంలో పెట్టిన తప్పుడు కేసులన్నింటినీ వచ్చే కాంగ్రెస్​ ప్రభుత్వం  రద్దు చేస్తుందని,  తప్పుడు కేసులు పెట్టిన వారిపై చర్యలు కూడా తీసుకుంటామని చెప్పారు.  ఈ కార్యక్రమంలో  ఎంపీటీసీ ఆళోత్​ ఈశ్వరీనందరాజ్​,  నాయకులు బొర్రా రాజశేఖర్​, బానోత్​ విజయాభాయి, తలారి చంద్రప్రకాశ్​​, ఇమ్మడి తిరుపతిరావు పాల్గొన్నారు.