బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ సిల్వర్‌‌‌‌‌‌‌‌ జూబ్లీ సభతో రాష్ట్రంలో పెనుమార్పులు

బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ సిల్వర్‌‌‌‌‌‌‌‌ జూబ్లీ సభతో రాష్ట్రంలో పెనుమార్పులు
  •  వచ్చే నెల 27న వరంగల్‌‌‌‌‌‌‌‌ జిల్లా ఎల్కతుర్తిలో బహిరంగ సభ
  • మాజీ ఎంపీ వినోద్‍కుమార్‍, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది, దాస్యం, చల్లా

వరంగల్‍, వెలుగు : వరంగల్‌‌‌‌‌‌‌‌ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో వచ్చే నెల 27న బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ సిల్వర్‌‌‌‌‌‌‌‌ జూబ్లీ సభ నిర్వహించనున్నట్లు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌‌‌‌‌‌‌‌భాస్కర్‌‌‌‌‌‌‌‌, పెద్ది సుదర్శన్‌‌‌‌‌‌‌‌రెడ్డి తెలిపారు. ఈ సభతో రాష్ట్రంలో పెనుమార్పులు సంభవిస్తాయని అన్నారు. హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ పార్టీ ఆఫీస్‌‌‌‌‌‌‌‌లో శుక్రవారం మీడియాతో మాట్లాడారు.

పోరాటాలు, త్యాగాలు, అభివృద్ధితో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ పనిచేసిందన్నారు. కేసీఆర్‍ పదేండ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్‌‌‌‌‌‌‌‌ వన్‌‌‌‌‌‌‌‌ స్థానంలో నిలిచిందన్నారు. కేసీఆర్‍ సైతం ఊహించని రీతిలో బహిరంగ సభను సక్సెస్‌‌‌‌‌‌‌‌ చేస్తామన్నారు. సభ, పార్కింగ్‌‌‌‌‌‌‌‌ ఇతర సౌకర్యాల కోసం 1,200 ఎకరాల్లో ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

సమావేశంలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‍రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, చల్లా ధర్మారెడ్డి, వొడితల సతీశ్‌‌‌‌‌‌‌‌బాబు, నన్నపునేని నరేందర్‍, శంకర్‌‌‌‌‌‌‌‌నాయక్‌‌‌‌‌‌‌‌, నాగుర్ల వెంకటేశ్వర్లు, కె.వాసుదేవరెడ్డి, మర్రి యాదవరెడ్డి పాల్గొన్నారు.