బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కొణతం దిలీప్ అరెస్ట్

బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కొణతం దిలీప్ అరెస్ట్

బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ ఛార్జ్  కొణతం దిలీప్  ను  హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలకు గాను దిలీప్ ను అరెస్ట్ చేశారు .  కోర్టు ఆదేశాలతో  సీసీఎస్ లో  నవంబర్ 18న విచారణకు హాజరయ్యారు దిలీప్. విచారణ అనంతరం సైబర్ క్రైం పోలీసులు దిలీప్ ను అదుపులోకి తీసుకున్నారు.  వైద్య పరీక్షల కోసం ఉస్మానియాకు తరలించారు పోలీసులు.

దిలీప్  బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో తెలంగాణ డిజిటల్ మీడియా డైరెక్టర్ గా పని చేశారు.  2024 ఆగస్టు 31న ఆసిఫాబాద్ జై నూర్ ఆదివాసీ మహిళ ఘటనలో సోషల్ మీడియా ద్వారా రెచ్చగొట్టే పోస్టులు చేసినందుకు పోలీసులు దిలీప్ ను  సెప్టెంబర్ 5, 2024న  అరెస్ట్  చేసిన సంగతి తెలిసిందే.   ఈ కేసులో ఇవాళ(నవంబర్ 18న) సీసీఎస్ ముందు విచారణకు హాజరవ్వగా పోలీసులు అదుపులోకి తీసుకుని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు.