బీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం ఇంచార్జ్ కొణతం దిలీప్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. దిలీప్ ను అరెస్ట్ చేసిన సైబర్ క్రైం పోలీసులు పీఎస్ కు తరలించారు. దిలీప్ గత ప్రభుత్వం హయాంలో తెలంగాణ డిజిటల్ మీడియా డైరెక్టర్ గా పని చేశారు. ఆసిఫాబాద్ జై నూర్ ఘటనలో సోషల్ మీడియా ద్వారా రెచ్చగొట్టే పోస్టులు చేసినందుకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ALSO READ | 18ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి.. తల్లిదండ్రులపై కూడా..
ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ లో ఆగస్టు 31న ఆదివాసి మహిళపై లైంగిక దాడి సంచలనంగా మారింది. తీవ్రగాయాలతో మహిళ ప్రస్తుతం సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో మహిళపై దాడికి నిరసనగా ఆదివాసి సంఘాలు వారం రోజులుగా ఆందోళనలు చేస్తున్నాయి. ఆందోళనలు ఉద్రిక్తంగా మారండంతో తెలంగాణ పోలీసులు సీరియస్ గా తీసుకుని జైనూర్ లో 144 సెక్షన్ అమలు చేశారు. సోషల్ మీడియాలో విద్వేషాలు రెచ్చగొట్టినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.