- కాంగ్రెస్ లో చేరిన యాదగిరిగుట్ట టౌన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు పెలిమెల్లి శ్రీధర్ గౌడ్
- కండువా కప్పి కాంగ్రెస్ లోకి ఆహ్వానించిన విప్ బీర్ల ఐలయ్య
యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్టలో బీఆర్ఎస్ కు భారీ ఝలక్ తగిలింది. బీఆర్ఎస్ యాదగిరిగుట్ట టౌన్ అధ్యక్షుడు పెలిమెల్లి శ్రీధర్ గౌడ్ తోపాటు 100 మంది బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సోమవారం బీఆర్ఎస్ కు రిజైన్ చేసి కాంగ్రెస్ లో చేరారు. వారందరికీ ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అభివృద్ధిలో పాలు పంచుకోవడం కోసం తిరిగి కాంగ్రెస్ లో చేరానని, తల్లిలాంటి కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి రావడం సంతోషంగా ఉందని పెలిమెల్లి శ్రీధర్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పాత, కొత్త అనే తేడా లేకుండా అందరూ కలిసి ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం పనిచేయాలన్నారు. భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో యాదగిరిగుట్ట ఎంపీపీ చీర శ్రీశైలం, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కానుగు బాలరాజుగౌడ్, టౌన్ అధ్యక్షుడు బందారపు భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.