
- మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి
యాదాద్రి, వెలుగు : ఈనెల 27న వరంగల్ లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభను విజయవంతం చేయాలని భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి క్యాడర్ కు పిలుపునిచ్చారు. సోమవారం భువనగిరిలో నిర్వహించిన సన్నాహాక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేసీఆర్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకుల మోసపూరిత హామీలకు ప్రజలు ఆకర్షితులు కావడంతో ఓటమి చెందాల్సి వచ్చిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకతను మూటగట్టుకుందని తెలిపారు.
త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకుంటానని భరోసా ఇచ్చారు. బీఆర్ఎస్ పార్లమెంట్ ఇన్చార్జి క్యామ మల్లేశం, భువనగిరి మున్సిపల్ మాజీ చైర్మన్లు ఆంజనేయులు, పెంట నరసింహ, నువ్వుల ప్రసన్నా సత్యనారాయణ పాల్గొన్నారు.