సర్కారుపై వ్యతిరేకత మొదలైంది

సర్కారుపై వ్యతిరేకత మొదలైంది

యాదాద్రి, వెలుగు : కాంగ్రెస్​ సర్కారుపై ప్రజల్లో అప్పుడే వ్యతిరేకత మొదలైందని మాజీ మంత్రి,  సూర్యాపేట ఎమ్మెల్యే గుండకండ్ల జగదీశ్ రెడ్డి తెలిపారు. వరంగల్​లో జరిగే బీఆర్​ఎస్ రజతోత్సవ బహిరంగ సభను విజయవంతం చేయాలని వలిగొండలోని మత్స్యగిరి లక్ష్మీనర్సింహస్వామి ఆలయం నుంచి యాదగిరిగుట్ట వరకు బీఆర్​ఎస్​ విద్యార్థి, యువజన విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్రను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఎన్నికల ముందు కాంగ్రెస్​ ఇచ్చిన హామీలను నమ్మిన ప్రజలు ఆ పార్టీని గెలిపించి, ఇప్పుడు మోసపోయామని గుర్తించారన్నారు. 

కేసీఆర్​ హయాంలో చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని చెప్పారు. వరంగల్​నిర్వహించే సభకు యాదాద్రి జిల్లా నుంచి భారీ ఎత్తున తరలి రావడానికి ప ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఒక్కో నియోజకవర్గం నుంచి 30 వేల మందికి పైగా తరలించడానికి ప్రయత్నం చేస్తున్నామని వివరించారు. బహిరంగసభ తర్వాత రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం మారిపోతుందని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు బూడిద భిక్షమయ్యగౌడ్​, గాదరి కిశోర్​కుమార్, పైళ్ల శేఖర్ రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్​గొంగిడి మహేందర్ రెడ్డి యువజన విభాగం లీడర్లు పాల్గొన్నారు.