సీఎంలు కావాలని కలలు కంటున్రు .. కాంగ్రెస్​ సీనియర్ల పై సీఎం కేసీఆర్, కేటీఆర్ ​ఫైర్​

  • హాలియా, చిట్యాలలో సుడిగాలి పర్యటన
  • జానారెడ్డి సీఎం కావాలన్నది పంచరంగుల కల : కేసీఆర్
  • జిల్లాలోనే సీఎం కుర్చీ కోసం నలుగురు మధ్య పోటీ : కేటీఆర్​

నల్గొండ, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్​ అధికారంలోకి వస్తే సీఎం పీఠం కోసం జిల్లాలోనే నలుగురు సీనియర్లు పోటీ పడుతున్నారని బీఆర్​ఎస్​ అగ్రనేతలు కేసీఆర్​, కేటీఆర్​ఎద్దేవా చేశారు.  మంగళవారం ​హాలియా నిర్వహించిన ప్రజా ఆశ్వీరాధ సభలో సీఎం కేసీఆర్, చిట్యాల రోడ్​షోలో పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్​కేటీఆర్ కాంగ్రెస్​ సీనియర్ల పైన విరుచుకుపడ్డారు.  హాలియా సభలో కేసీఆర్​ సీనియర్​ నేత జానారెడ్డిపై సెటైర్లు వేశారు.

ఉమ్మడి ఏపీలో అనేక శాఖలకు మంత్రిగా పనిచేసిన జానారెడ్డి సీఎం కావాలని పంచరంగుల కల కంటున్నారని విమర్శించారు. ఆయన హయాంలో నాగార్జునసాగర్​లో నాలుగు రోడ్లు బాగుపడ్డాయే తప్ప నియోజకవర్గ అభివృద్ధి జరగలేదన్నారు. ఉప ఎన్నికల్లో నోముల భగత్​ చేతిలో జానారెడ్డి ఓడిపోవడంతోనే నియోజకవర్గం బాగుపడిందని చెప్పారు. అసెంబ్లీలో 24 గంటల కరెంట్​ ఇస్తే బీఆర్​ఎస్​ కండువా కప్పుకుంటానని ప్రతిపక్ష నాయ కుడి హో దాలో చాలెంజ్​ చేసిన జానారెడ్డి మాట తప్పాడని చురకలంటించారు.  జానా రెడ్డి పైన విమర్శలు చేయడం తనకు ఇష్టం లేదని అంటూనే సీఎం పదవిపై ఆయన కంటున్న కలలు నెరవేరవని స్పష్టం చేశారు.  

సీనియర్లపై విరుచుకుపడ్డ కేటీఆర్

ఇక చిట్యాల సభలో కేటీఆర్​ ఉత్తమ్​, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపా ల్​ రెడ్డి, జానారెడ్డిలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్​ఎస్​లో ఒక్కరే సీఎం అభ్యర్థు ఉంటే.. ఒక్క నల్గొండ జిల్లా నుంచే నలుగురు సీనియర్లు పోటీలో ఉన్నారని  విమర్శించారు.    జానారెడ్డి అయితే ఎన్నికల్లో పోటీ చేయకుండానే సీఎం అవుతానని చెప్పడం  విడ్డూరంగా ఉందన్నారు.

డబ్బు మదంతో కోమటిరెడ్డి బ్రదర్స్​పేట్రేగిపోతున్నారని, ఓటర్లు వాళ్లు ఇచ్చే డబ్బులు తీసుకుని బీఆర్​ఎస్​కు ఓటు వేయాలని సూచించారు.  కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీల సంగతేమో గానీ, నెలకు ఒక సీఎం మారడం మాత్రం ఖాయమని విమర్శించారు. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య  మాట్లాడుతూ.. తన రాజకీయ ఎదుగుదల చూసి ఓర్వే లేకనే కోమటిరెడ్డి బ్రదర్స్​ రాజకీయంగా కక్ష పెంచుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం నేర చరిత్ర అందరికీ తెలుసని అలాంటి వ్యక్తిని  ప్రజల ముందుకు తీసు కురావడం సిగ్గుచేటని మండిపడ్డారు. 40 ఏళ్లలో జరగని అభివృద్ధి రెండేళ్లలో చేసి చూపించామని ఎమ్మెల్యే భగత్​ అన్నారు.  బైపోల్​లో ఇచ్చిన హామీ మేరకు సీఎం కేసీఆర్​ రూ.200 కోట్లు శాంక్షన్​ చేశారని, 90 శాతం పనులు కంప్లీట్​ చేశామని చెప్పారు. మళ్లీ గెలిపిస్తే కొత్త, పాత హామీలు నెరవేరుస్తామని మాటిచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్​ బండా నరేందర్​ రెడ్డి, అమిత్​ రెడ్డి, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, తదితరులు హాజరయ్యా రు. 

 వ్యూహం మార్చిన బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్...

ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్​ గాలి వీస్తోందని తాజా సర్వేలు చెప్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్​ ఎన్నికల వ్యూహాన్ని మార్చింది. కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాంగ్రెస్ అగ్రనేతలే లక్ష్యంగా కామెంట్లు చేస్తున్నారు. కాంగ్రెస్ పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వస్తే సంక్షేమ పథకాలు రద్దు అవుతాయని చెప్పడంతో పాటు సీఎం పీఠం గురించి చర్చ లేవనెత్తారు.  క్షేత్రస్థాయిలో బలమైన పార్టీ కేడర్​ చేజారిపోతుండటంతో బీఆర్​ఎస్ స్టార్​ క్యాంపైనర్లుగా కేటీఆర్​, హరీశ్​ రావు ఎంట్రీ ఇస్తున్నారు.  

త్వరలో నకిరేకల్, నల్గొండ, సూర్యాపేటలో సీఎం సభలు ఉన్నాయి. ఈ మధ్యలోనే  కేటీఆర్ రోడ్​షోలు చేపడుతున్నారు.  కోమటిరెడ్డి బ్రదర్స్ ప్రభావం చూపే నకిరేకల్​నియోజక వర్గంలో కేటీఆర్​రోడ్​షోకు రావడం చర్చకు దారితీసింది. ఇటీవల చిట్యాల మండలంలోని బీఆర్​ఎస్ కేడర్ మొత్తం కాంగ్రెస్​లో చేరింది. దీంతో చిట్యాల వేదికగా కేటీఆర్​ పార్టీ కేడర్​లో జోష్​ నింపే ప్రయత్నం చేశారు. త్వరలో మిర్యాలగూడ, ఆలేరులో కేటీఆర్​రోడ్‌‌‌‌‌‌‌‌ షోలు నిర్వహించనున్నారు.