తెలంగాణ గీతంపై బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌ది అనవసర రాద్ధాంతం

తెలంగాణ గీతంపై బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌ది అనవసర రాద్ధాంతం

వేములవాడ, వెలుగు : ‘జయ జయహే’ గీతంపై బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌ది అనవసర రాద్ధాంతమని విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్​ ఎద్దేవా చేశారు. గురువారం వేములవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పదేళ్ల బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌ పాలనలో అధికారిక రాష్ట్ర గీతాన్ని ఎందుకు ప్రకటించలేదని విమర్శించారు. నేడు కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం జయ జయహే తెలంగాణ గేయాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటిస్తామంటే కేసీఆర్, కేటీఆర్ ఓర్చుకోలేకపోతున్నారన్నారు. తెలంగాణ గుండె తడి తెలిసిన అణగారినవర్గానికి చెందిన అందెశ్రీకి గౌరవం  దక్కితే  బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌ తట్టుకోలేకపోతుందన్నారు.