వర్ధన్నపేట, వెలుగు : మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలు పంపిణీ చేస్తోందని బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ చెప్పారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలోని కోనారెడ్డి చెరువులో శనివారం చేప పిల్లలు వదిలారు. అనంతరం చెరువు కట్ట రిపేర్, సుందరీకరణ పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ హయాంలోనే మత్స్యకారుల కష్టాలు తీరాయన్నారు. మత్స్యకారుల కోసం సొసైటీలు ఏర్పాటు చేసి హక్కులు కల్పించిన ఏకైక రాష్ట్రం తెలంగాణే అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ అరుణ, వైస్ చైర్మన్ ఎలేందర్‌రెడ్డి పాల్గొన్నారు.