కవిత జైలుకు వెళ్లడంతో బీఆర్ఎస్ బలహీనపడింది : కడియం శ్రీహరి

పదేళ్లలో కేసీఆర్ కుటుంబం అభివృద్ధి చెందింది తప్పా..  రాష్ట్రానికి చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు స్టేషన్ ఘనపూర్ ఎమ్మె్ల్యే కడియం శ్రీహరి.  కేసీఆర్ కుటుంబం అభివృద్ధితో పాటు భూకబ్జాలకు పాల్పడిందని ఆరోపించారు. జనగామ జిల్లాలో ఎంపీ అభ్యర్ధి కడియం కావ్య తరుపున ఆయన ప్రచారం నిర్వహించారు.   లిక్కర్ స్కామ్ లో కవిత జైలుకు వెళ్లడంతో  పార్టీ బలహీనపడిందన్నారు.   గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామాలను అభివృద్ధి చేస్తానని మాట ఇచ్చానని..  అభివృద్ధి కోసమే కాంగ్రెస్ లో  చేరినట్లుగా తెలిపారు.  తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించాలని కోరారు.  గతంలో ఎమ్మెల్యేగా ఉన్న  డాక్టర్ రాజయ్య అభివృద్ధిని మరిచి అవినీతికి పాల్పడ్డాడని శ్రీహరి ఆరోపించారు.