నిర్మల్, వెలుగు: పేద, బడుగు, బలహీన వర్గాల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలే తమను గెలిపిస్తాయని మంత్రి, నిర్మల్ అభ్యర్థి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఆదివారం నిర్మల్లోని పలు కాలనీల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా వివిధ వార్డులకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరగా, వారికి పార్టీ కండువాలు కప్పి మంత్రి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ.. కాం గ్రెస్, బీజేపీకి ప్రజలను ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నారు. ఆ రెండు పార్టీలు ప్రజలకు చేసిందేమీలేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పని ఎన్నో పథకాలను కూడా అమలు చేసిందన్నారు.