బీఆర్ఎస్ మూడు పార్టీలుగా విడిపోతుంది : మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు సీఎం కావడానికి ప్లాన్ లో ఉన్నట్లుగా కనిపిస్తుందని...కేసీఆర్, కేటీఆర్ కు వెన్ను పోటు పొడిచేలా హరీష్ మాటలు ఉన్నాయని అన్నారు. కేసీఆర్ ను వ్యతిరేకించి వస్తే హరీష్ ను సపోర్ట్ చేస్తామంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. కవిత, హరీష్, కేటీఆర్ ల పేర్ల మీద బీఆర్ఎస్ మూడు పార్టీలుగా విడిపోతుందని ఆరోపించారు.  

హరీష్ రావు బీఆర్ఎస్ లోనే ఉంటే ఎల్పీ లీడర్ కూడా కాలేడన్నారు.  ఇంకో 20 ఏళ్లు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.  తనను సీఎం చేస్తే  మేడిగడ్డ పనులు పూర్తి చేసి చూపిస్తానని హరీష్ రావు కామెంట్స్ చేసిన నేపథ్యంలో  మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ కామెంట్స్ చేశారు.