
కామారెడ్డి : బాన్సువాడ మున్సిపాలిటీలో ఫోర్జరీ సంతకం కలకలం సృష్టించింది. మున్సిపల్ కమిషనర్ రమేష్ తన సంతకాన్ని బీఆర్ఎస్ కార్యకర్త శివప్రసాద్ ఫోర్జరీ చేశారని ఆరోపిస్తున్నారు. ఇటీవల రేకుల షెడ్డుకు విద్యుత్ మీటర్ కోసం పట్టణానికి చెందిన రుద్రంగి అశోక్ అనే వ్యక్తి దరఖాస్తు చేసుకున్నాడు. అయితే దరఖాస్తు ఫారంపై కమిషనర్ సంతకాన్ని ఫోర్జరీ చేశాడు శివప్రసాద్ . స్థానికుల పిర్యాదుతో ఈ విషయాన్ని అధికారులు ఆలస్యంగా గుర్తించారు. దీంతో తన సంతకం ఫోర్జరీ జరిగిందంటుంటూ మున్సిపల్ కమిషనర్ రమేష్ పోలీసులను ఆశ్రయించాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.