రాష్ట్రంలో బీఆర్ఎస్ కార్యకర్తలు రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్ష పార్టీల వారు కనిపిస్తే చాలు వారిపై దాడికి పాల్పడుతున్నారు. తాజాగా నల్గొండ జిల్లాలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డిపై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు.
నాగార్జున సాగర్ బై ఎలక్షన్ లో కేసీఆర్ ప్రచారానికి వెళ్లినప్పుడు.. నెల్లికల్ లిప్టు కట్టిస్తానని వాగ్దానం చేశారని.. కానీ అది ఇప్పటివరకు నెరవేర్చలేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు ధర్నా చేపట్టారు. దీంతో ధర్నాలో పాల్గొన్న శ్రీధర్ రెడ్డిపై బీఆర్ఎస్ కార్యకర్తలు విచక్షణరహితంగా దాడి చేశారు.