ప్రభుత్వ స్కీంల్లో పేదలకు అన్యాయం:బీఆర్ఎస్ కార్యకర్తలు

ప్రభుత్వ స్కీంల్లో పేదలకు అన్యాయం:బీఆర్ఎస్ కార్యకర్తలు
  • తమను పట్టించుకోవడం లేదని కేసీఆర్​, ముత్తిరెడ్డి దిష్టిబొమ్మలు దహనం చేసిన బీఆర్​ఎస్​ కార్యకర్తలు 
  • సిద్దిపేట జిల్లా గురువన్నపేటలో నిరసన 

కొమురవెల్లి, వెలుగు : సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలంలోని గురువన్నపేటలో శుక్రవారం బీఆర్ఎస్ కార్యకర్తలు సీఎం కేసీఆర్​..ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేప ట్టారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గృహలక్ష్మి, దళిత బంధు, బీసీ బంధు సంక్షేమ పథకాల ఎంపికకు సంబంధించి గ్రామంలోని నిరుపేదలకు అన్యాయం జరుగుతోందని, అలాగే సొంత పార్టీ లీడర్లే కిందిస్థాయి కార్యకర్తలమైన తమను అణగదొక్కుతున్నారంటూ గ్రామపంచాయతీ ఆఫీసు దగ్గర సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదరిగిరెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు. బీఆర్ఎస్ పార్టీ మాటల పార్టీ మాత్రమేనని, దొంగ పార్టీ అని ఆరోపించారు. ‘ప్రజలారా ఇప్పటికైనా అర్థమైందా...మేల్కోండి’ అంటూ నినాదాలు చేశారు. ఓరుగంటి గణేశ్, ఓరుగంటి రమేశ్, రాయమల్లు, బ్రహ్మాండపల్లి ఎల్లవ్వ, కిష్టయ్య, గ్రామస్తులు పాల్గొన్నారు.