కులగణన మళ్లీ చేస్తే నేను ,కేసీఆర్ పాల్గొంటాం : కేటీఆర్

కులగణన మళ్లీ చేస్తే నేను ,కేసీఆర్ పాల్గొంటాం : కేటీఆర్

కులగణన తప్పుల తడక, అశాస్త్రీయం ..మళ్లీ రీ సర్వే చేసి లెక్కలు తేల్చాలన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ భవన్ లో  బీసీ నేతలతో సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. శాస్త్రీయంగా కులగణన రీ సర్వే చేస్తే..కేసీఆర్ తో సహా తామంతా పాల్గొంటామన్నారు.  బీసీలను తక్కువ చేసి చూపించడంపై  బీసీలు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. బీసీలకు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలన్నారు. 

 త్వరలోనే బీఆర్ఎస్ బీసీ బహిరంగ సభ పెడతామని చెప్పారు కేటీఆర్. కాంగ్రెస్ కామారెడ్డి డిక్లరేషన్ పెట్టిన చోటనే బీసీ బహిరంగ సభ పెడతామని అన్నారు కేటీఆర్.ఆనాడు కేసీఆర్ చేసిన సమగ్ర కుటుంబ సర్వేతోనే బీసీల లెక్క సరిగా తేలిందని  చెప్పారు కేటీఆర్. ఇన్నేండ్లైనా కేంద్ర ప్రభుత్వం బీసీలకు  ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయలేదన్నారు. బీసీలకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు.  

ALSO READ | 48 గంటలు కాదు.. 48 రోజులైనా వరి బోనస్ పడుతలేదు: హరీశ్ రావు

42 శాతం బీసీ డిక్లరేషన్ చెప్పినటువంటి కాంగ్రెస్  అందుకు కట్టుబడి  ఉండాలన్నారు. బీసీలకు న్యాయం  చేసింది బీఆర్ఎస్సేనని చెప్పారు.  అసెంబ్లీ  ఎన్నికల్లో తాము 34 సీట్లు  ఇచ్చి చిత్తశుద్ది చాటుకున్నాం.. 34 సీట్లు ఇస్తామని చెప్పిన  కాంగ్రెస్  19 ఇచ్చిందన్నారు కేటీఆర్.