కడియం కుట్రలకు తెరలేపి పార్టీని చిల్చిండు : కేటీఆర్

అసెంబ్లీ ఎన్నికల్లో హామీలు ఇచ్చి ప్రజలను మోసంచేసిన సీఎం రేవంత్ రెడ్డి .. ఇప్పుడు దేవుళ్ల మీద ఒట్టువేసి మళ్ళీ నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్.  ఇప్పటికే బాసర,యాదాద్రికి పోయి దేవుళ్ల మీద ఒట్టు వేశాడని ఇప్పటికి వరంగల్ భద్రకాళి అమ్మవారి మీద ఒట్టు వేశాడన్నారు.  భద్రకాళి అమ్మవారి చాలా  డెంజర్ వదిలి పెట్టదన్నారు. 

ఈ పార్లమెంట్ ఎన్నికలు సామాన్యమైనవి కాదన్నారు కేటీఆర్.  వంద రోజులు అబద్దానికి.. పదేళ్ల నిజానికి మద్య జరుగుతున్నవని చెప్పారు. వరంగల్ లో విశ్వాస ఘాతకులు.. నికార్సైన ఉద్యమకారుడి మద్య జరుగుతున్న పోరన్నారు. కడియం శ్రీహరిని ఉప ముఖ్యమంత్రిని చేసి పదేళ్లలో మూడు చట్ట సభలకు పంపితే.. కుట్రలకు తెరలేపి పార్టీని చిల్చాడని ఆరోపించారు.  

దళిత నేతలను పార్టీ నుండి సాగనంపాడని..  ఇంట్లో భోజనం చేసి  ఫోటోలు దిగి వెన్నుపోటు పొడిచాడన్నారు. కావ్య భర్త కూడా కేసిఆర్ ను చూసి ఫ్యాన్ అయ్యాడిని చెప్పారు కేటీఆర్.  సంవత్సరం లోపే కేసీఆర్ రాష్ట్ర రాజకీయాలను శాసించే రోజు వస్తుందన్నారు.