కరెంట్ కోతలు కామన్ అయినయ్: కేటీఆర్

కరెంట్ కోతలు కామన్ అయినయ్: కేటీఆర్

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో కరెంట్ కోతలు కామన్ అయ్యాయని బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణలో మళ్లీ చీకట్లు మొదలయ్యాయని తెలిపారు. విద్యుత్​ రంగంలో బీఆర్ఎస్​ సృష్టించిన సదుపాయాలను సరిగ్గా వాడుకోలేని అసమర్థ స్థితిలో రేవంత్​సర్కార్​ఉన్నదని ఫైర్ అయ్యారు. ఈ మేరకు రాష్ట్రంలో విద్యుత్​ కోతలపై కేటీఆర్ శనివారం ​ట్వీట్ ​చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ట్యాగ్​ చేస్తూ నెటిజన్ల ట్వీట్లను ఆయన రీట్వీట్ ​చేశారు.

‘‘2014కు ముందు తరుచూ విద్యుత్​ కోతలు, పవర్​ హాలిడేస్​మనకు తెలిసిందే. ఆ పరిస్థితిని మార్చేసిన ఘనత కేసీఆర్​ సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ది. 24 గంటల నాణ్యమైన కరెంటు సరఫరా చేయడం వల్ల హైదరాబాద్​ అభివృద్ధిలో దూసుకుపోయింది. ఇప్పుడున్న కాంగ్రెస్​ ప్రభుత్వం మళ్లీ పదేండ్ల క్రితం నాటి రోజులను తిరిగి తీసుకొచ్చింది. విద్యుత్​ కోతలతో ప్రజలకు, పరిశ్రమలకు ఇబ్బంది తీసుకొస్తోంది’’ అని కేటీఆర్‌‌‌‌‌‌‌‌ పేర్కొన్నారు.