సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. రేవంత్ పక్కనే మానవబాంబులు ఉన్నాయన్నారు కేటీఆర్. రేవంత్ కు ఫ్రస్టేషన్ ఎక్కువైంది.. రేవంత్ రెడ్డి 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండాలి... కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలు అమలు చేయాలి.. సీఎం రేవంత్ నువ్వు మగాడివైతే ఇచ్చిన హామీలు నిలుపుకోవాలని.. దమ్ముంటే 100 రోజుల్లో రూ. 2 లక్షల రుణమాఫీ చెయ్యాలన్నారు. అబద్ధాలు చెప్పి రేవంత్ రెడ్డి గద్దెనెక్కారని మండిపడ్డారు కేటీఆర్.
ALSO READ :- IND vs ENG: స్పిన్నర్ల తడాఖా.. తక్కువ స్కోర్‌కే ఇంగ్లాండ్ ఆలౌట్
తెలంగాణలో వచ్చిన కరువు కాంగ్రెస్ తెచ్చిందేనని విమర్శించారు కేటీఆర్. కరువు రాకుండా కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టారని తెలిపారు. తెలంగాణ పథకాలను కేంద్రం కాపీ కొట్టిందన్నారు. కేసీఆర్ పై కోపాన్ని రైతులపై తీర్చుకుంటున్నారని.. అబద్ధాలు చెప్పి రేవంత్ గద్దెనెక్కారని విమర్శించారు కేటీఆర్.