మాటతప్పి దైవ ద్రోహం చేశారు.. సీఎం రేవంత్ తీరుపై కేటీఆర్ ఫైర్

  • రుణమాఫీ హామీ నెరవేర్చలేదు
  • రుణమాఫీపై శ్వేతపత్రం విడుదల చేయాలె 
  • మాజీ మంత్రి హరీష్ రావు 
  • రుణమాఫీపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసనలు 

హైదరాబాద్:రుణమాఫీ చేస్తామని అనేక దేవుళ్ల మీద ఒట్లేసి, చేయకుండా సీఎం దైవద్రోహనికి పాల్పడ్డారని బీఆర్ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్, మాజీ మంత్రి​ కేటీఆర్  విమర్శించారు.  పంట రుణమా ఫీపై  రాష్ట్రంలోని  అన్ని మండల, నియోజకవర్గ కేంద్రాల్లో   బీఆర్ఎస్​ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలను  నిర్వహించారు.  రుణమాఫీపై  ప్రభుత్వ తీరుకు నిరసనగా  చేవెళ్లలో  రైతులతో కలిసి కేటీఆర్, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ​ధర్నాలో  పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... డిసెంబర్​ 9న  ఒక్క సంతకంతో రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి, తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.  రుణమాఫీపై  ప్రభుత్వ తీరును నిరసిస్తూ  మాజీ మంత్రి  హరీశ్​రావు యాదాద్రి లక్ష్మినరసింహ స్వామి టెంఫుల్​ టూర్​ చేపట్టారు.   అనంతరం ఆలేరులో రైతులతో కలిసి నిరసన కార్యక్రమంలో పాల్గొని హరీశ్​ రావు మాట్లాడారు..   రుణమాఫీ పై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు.  రుణమాఫీపై మంత్రులు తలో మాట మాట్లాడుతున్నారని ఆరోపించారు.  

ALSO READ | సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్.. డిప్యూటీ సీఎం భట్టి కూడా..

రాష్ట్రంలో రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్​ చేశారు.  సీఎం దేవుడి మీద  ఒట్లు వేసి మాట తప్పినందున ప్రజలను శిక్షించొద్దని ఆ లక్ష్మినరసింహాస్వామిని  వేడుకున్నట్లుగా ఆయన తెలిపారు.   మండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్ మాట్లాడుతూ..  రెండు లక్షల రుణం మాఫీ చేయకుండా కాంగ్రెస్​ రైతులను మోసం చేస్తోందన్నారు. రాష్ట్రంలో మరో ఉద్యమం రావాలన్నారు.  సీఎం గవర్నమెంట్​ బిల్డింగ్​లో ఉండాలన్నారు.