మహేందర్ రెడ్డి, రంజిత్ రెడ్డిలను మళ్లీ బీఆర్ఎస్లో చేర్చుకోం : కేటీఆర్

  మహేందర్ రెడ్డి,  రంజిత్ రెడ్డిలను మళ్లీ బీఆర్ఎస్లో చేర్చుకోం :  కేటీఆర్

బీఆర్ఎస్ పార్టీని  వీడి  కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి,  ఎంపీ రంజిత్ రెడ్డిలపై  బీఆర్ఎస్  వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైరయ్యారు.  తెలంగాణ భవన్ లో చేవెళ్ల పార్లమెంట్ రివ్యూ మీటింగ్ లో కేటీఆర్ మాట్లాడుతూ  .. పార్టీ మారేది లేదని వాళ్లే  తనకు  చెప్పారని.. అప్పడు వాళ్ల మాటలు తాను పిచ్చోడిలా నమ్మానన్నారు.  15 రోజుల్లోనే వాళ్లు  జెండా మార్చరాన్నారు.   మహేందర్ రెడ్డి,  రంజిత్ రెడ్డిలు  అస్కార్ లేవల్ లో  నటించారని ఎద్దేవా చేశారు.  

ఇంటి దొంగలను ఈశ్వరుడైనా పట్టలేడని అంటారు. ఈ సామెత వీరిద్దరి విషయంలో సరిగ్గా సరిపోతుందన్నారు కేటీఆర్.  అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మొదట రంజిత్‌రెడ్డే తనకు ఫోన్‌ చేశాడని..  చేవెళ్ల అభ్యర్థిగా తనను ప్రకటించాలని..  తప్పకుండా గెలుద్దామని అన్నాడని కేటీఆర్ చెప్పారు. 

వాళ్లిద్దరిని మళ్లీ బీఆర్ఎస్ లో చేర్చుకునేది లేదన్నారు.  అసెంబ్లీ ఎన్నికల్లో చేవెళ్లలో చాలాచోట్ల తాను ప్రచారం చేశానన్నారు కేటీఆర్.  తాండూరు అసెంబ్లీ సీటు ఏకపక్షంగా గెలుస్తామనుకున్నాం కానీ..  ఏం జరిగిందో తెలియదు కొన్ని చోట్ల ఓడిపోయామని తెలిపారు.